Breaking News

పెట్రోల్ ధరలపై జగన్ ఫైర్.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్న

మే 27, (నేటి తెలుగు పత్రిక): వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.‘తన కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు ప్రజలను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారు. నిరుద్యోగ భృతి ఏమైంది?’ అని ప్రశ్నించారు.పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయని, అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. ‘సూపర్ సిక్స్ హామీలన్నీ మోసమే. ప్రజలు ప్రశ్నిస్తే గొడ్డలి పార్టీ అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ పార్టీ సమావేశంలో జగన్ విమర్శలు గుప్పించారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *