Breaking News

మొక్కజొన్న రైతులకు భారీ ఊరట.. ₹1,173 కోట్లు విడుదల: తుమ్మల నాగేశ్వర రావు

మే 27, (నేటి తెలుగు పత్రిక): తుమ్మల నాగేశ్వర రావు మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో లక్ష మంది రైతుల ఖాతాల్లో ₹1,173 కోట్లు జమ కానున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్న సేకరణలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.రైతులకు మద్దతుగా ప్రభుత్వం వేగంగా చెల్లింపులు చేస్తోందని, పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *