Breaking News

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

మే 27, (నేటి తెలుగు పత్రిక): ఎన్. చంద్రబాబు నాయుడు, వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మినీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.మహానాడు వేదికగా చంద్రబాబు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాజమహేంద్రవరం సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన కార్యకర్తలు లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు.ఈ పరిణామాలతో రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *