Breaking News

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

మే 27, (నేటి తెలుగు పత్రిక): గోదావరి నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పరిశ్రమలు వ్యర్థాలను గోదావరిలో కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాల మేరకు గోదావరి కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. పరిశ్రమలు స్థానిక వనరులను వినియోగించుకుని లాభాలు పొందుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు తేవడం సహించబోమని స్పష్టం చేశారు.ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిందని మంత్రి ఆరోపించారు. పరిశ్రమ నుంచి విడుదలైన రసాయనాల్లో పీహెచ్ స్థాయిల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. మురుగునీరు నేరుగా గోదావరిలోకి విడుదల చేస్తే పరిశ్రమలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గోదావరి పుష్కరాల కోసం రూ.8,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, యాత్రికుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో నంది నాటకోత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *