Breaking News

ఎన్టీఆర్ జయంతికి లోకేశ్ ఘన నివాళులు

మే 28, (నేటి తెలుగు పత్రిక): లోకేశ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.సోషల్ మీడియాలో స్పందించిన లోకేశ్.. ప్రపంచానికి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అణగారిన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.మహిళా సాధికారతకు ఎన్టీఆర్ బాటలు వేసారని, సంక్షేమ పాలనకు ఆయన చిరునామాగా నిలిచారని లోకేశ్ గుర్తుచేశారు. “కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మరణంలేని మహామనిషి ఎన్టీఆర్‌కు జోహార్లు” అంటూ నివాళులు అర్పించారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *