Breaking News

విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..ఎంపీ శ్రీభరత్ నివాళులు

మే 28, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తెలుగు దేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించి సమాజంలో పెద్ద మార్పుకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలు కీలకంగా మారాయని తెలిపారు.మహిళలకు చట్ట సభల్లో మూడొంతుల రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో తెలుగు దేశం పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. పార్టీ స్థాయిలోనే మహిళలకు మూడొంతుల ప్రాధాన్యం కల్పిస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు.ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి గౌరవాన్ని పెంచారని అన్నారు. సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని, మహిళల సాధికారతకు బాటలు వేసిన మహానుభావుడని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.తెలుగు దేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు: జూనియర్ ఎన్టీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *