Breaking News

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు

మే 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయ నిర్మాణ పనులతో పాటు నైపుణ్య విశ్వవిద్యాలయం శాశ్వత ప్రాంగణ పనులను మంత్రులు తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తున్నామని మంత్రులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *