బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం.. సిట్ విచారణకు జగన్ పీఏ

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం.. సిట్ విచారణకు జగన్ పీఏ

మే 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కేఎన్‌ఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం రెండోరోజు కూడా విచారించింది. ఇప్పటికే మొదటి రోజు విచారణలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.మద్యం వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు.. లిక్కర్ ముఠా మరియు కీలక రాజకీయ నాయకుల మధ్య కేఎన్‌ఆర్ ప్రధాన సమన్వయకర్తగా పనిచేశాడనే అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద ఒప్పందాలు, కీలక వ్యక్తులతో సంబంధాలపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.ఈ కేసులో మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం. సాయంత్రం వరకు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో కేఎన్‌ఆర్ అరెస్ట్‌పై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.మద్యం కుంభకోణం కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుండగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ముదురుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్