Breaking News

నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్ర విభాగాలకు కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది.ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించగా, పంజాబ్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ థిల్లాన్‌కు బాధ్యతలు అప్పగించింది. హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానం, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్‌రాయ్‌ను నియమించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *