Breaking News

గ్రామీణ తెలంగాణకు హైస్పీడ్ ఇంటర్నెట్‌పై ప్రభుత్వం దృష్టి

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ నిధుల విడుదల, ఒప్పంద ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలులో భాగంగా మండలాల నుంచి గ్రామపంచాయతీల వరకు రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక మార్గంలో అంతరాయం వచ్చినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు కొనసాగేందుకు రింగ్ ఆర్కిటెక్చర్ విధానాన్ని అమలు చేయనున్నారు.మొదటి దశలో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాల్లో దెబ్బతిన్న డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *