బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము తీవ్ర విమర్శలు

కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము తీవ్ర విమర్శలు

కృష్ణా జిల్లా, మే 28, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే ముందు ఆయన స్థాయిని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము, ప్రస్తుతం కొడాలి నాని కార్పొరేటర్‌గా కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు. గుడివాడ ప్రజలు భారీ ఓట్ల తేడాతో ఓడించినా ఇంకా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు.విజయవాడలో కూర్చొని వ్యాఖ్యలు చేయడం కాదని, దమ్ముంటే గుడివాడకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు సేవ చేయగలిగితే చేసి చూపించాలని అన్నారు.గుడివాడలో కొడాలి నాని రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, ప్రజలు ఆయనను చాలాకాలం క్రితమే మరిచిపోయారని వ్యాఖ్యానించారు. సమాజం తిరస్కరిస్తున్నా ఇంకా విమర్శలు చేయడం సరికాదన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి వేరు అని, వారిపై విమర్శలు చేసే ముందు రాజకీయ పరిజ్ఞానం ఉండాలని సూచించారు.అమరావతి విషయంలో మాట మార్చిన వ్యక్తి జగన్ అని, అలాంటి నాయకత్వాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తానని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారని ప్రశ్నించారు.కొంతమంది వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై కాకుండా సామాజిక మాధ్యమాల ప్రచారాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. గుడివాడలో క్షేత్రస్థాయిలోకి వచ్చి రాజకీయంగా తేల్చుకుందామని కొడాలి నానికి ఎమ్మెల్యే రాము సవాల్ విసిరారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్