Breaking News

టీడీపీ దమ్మున్న రాజకీయ పార్టీ: హోంమంత్రి అనిత

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు రెండో రోజు కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు.మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నిర్ణయంతో కొన్ని రాజకీయ పార్టీల్లో కలవరం మొదలైందని వ్యాఖ్యానించారు.టీడీపీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే రాజకీయ పార్టీ అని పేర్కొన్న అనిత, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించడమే పార్టీ లక్ష్యమని చెప్పారు.మహిళల సాధికారత, అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *