మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, మేడారం సమ్మక్క-సారక్క జాతర తరహాలోనే భద్రాచలం ఆలయాన్ని కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.భద్రాచలం దేవాలయ అభివృద్ధి కోసం రూ.351 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీతక్క పేర్కొన్నారు.
