Breaking News

డంపింగ్ యార్డుల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: మంత్రి నారాయణ

మే 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వ్యర్థాలను విద్యుత్‌గా మార్చే కేంద్రాలు పనిచేస్తుండగా, కొత్తగా మరో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం ప్రత్యేక వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ప్రతిరోజూ వేల టన్నుల చెత్తను కంపోస్ట్‌, జీవవాయువుగా మారుస్తామని పేర్కొన్నారు.కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల శుద్ధి కేంద్రాలను పరిశీలించిన మంత్రి, గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసినప్పటికీ భారీగా చెత్త పేరుకుపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, ఇబ్రహీంపట్నంలో కొత్త జీవవాయు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పట్టణ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక సుస్థిరత సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *