బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతు డిస్కమ్‌తో వ్యవసాయానికి ప్రమాదం: కవిత

రైతు డిస్కమ్‌తో వ్యవసాయానికి ప్రమాదం: కవిత

మే 29, (నేటి తెలుగు పత్రిక): రైతు డిస్కమ్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం రైతుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సమావేశంలో పాల్గొన్న ఆమె, ఈ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించాలని డిమాండ్ చేశారు.రైతులకు మేలు చేసే నిర్ణయమే అయితే ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచిందని ప్రశ్నించిన కవిత, అసెంబ్లీలో చర్చించకుండా తీసుకొచ్చిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. కొత్త డిస్కమ్ వల్ల తెలంగాణలోని లక్షలాది బోర్ల మోటార్ల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని బలోపేతం చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.డిస్కమ్‌లకు వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడమే అసలు సమస్య అని కవిత పేర్కొన్నారు. ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న వ్యవస్థను కొత్త సంస్థ పేరుతో మార్చడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.కొత్త డిస్కమ్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుందని, ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు, విద్యుత్ సేవలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ రంగాన్ని రెండో ప్రాధాన్యంగా చూస్తున్న ప్రభుత్వం వైఖరి సరికాదని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే దిశగా ప్రభుత్వం పరోక్షంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.ఈ ప్రతిపాదన వ్యవసాయానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, రైతులకు శాపంగా మారుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతి రైతు వద్దకు వెళ్లి నిజాలు చెబుతామని హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి