Breaking News

మహానాడు 2026 విజయానికి ప్రతి ఒక్కరి కృషే కారణం: మంత్రి లోకేశ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 విజయవంతం కావడం పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ విజయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల అందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.సమష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మహానాడు నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలే అధినేతలుగా, నేతలే మార్గదర్శకులుగా వ్యవహరించడం పార్టీ బలాన్ని చూపిందన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించాల్సి వచ్చినప్పటికీ, దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని అన్నారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల తీర్మానం సహా పలు నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని ఆయన పేర్కొన్నారు. మహానాడు 2026 విజయాన్ని ప్రతి టీడీపీ కుటుంబ సభ్యుడికి అంకితం చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *