Breaking News

ట్రాన్స్‌జెండర్లకు ఉచిత లింగ మార్పిడి చికిత్స.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

మే 30, (నేటి తెలుగు పత్రిక): ట్రాన్స్‌జెండర్ సమాజ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన లింగ మార్పిడి చికిత్సలు, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ సేవలను హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ద్వారా అందించనున్నట్లు సమాచారం.ఈ నిర్ణయం ప్రకారం, లింగ మార్పిడి ప్రక్రియలో భాగమైన హార్మోన్ చికిత్సలు, వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య సలహాలు, సెక్స్ రీ అసైన్‌మెంట్ శస్త్రచికిత్సలకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది. ఇందుకోసం ఉస్మానియా ఆస్పత్రికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలని నిర్ణయించింది.ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ తరహా చికిత్సలు, శస్త్రచికిత్సలకు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది. అధిక వ్యయం కారణంగా చాలా మంది ట్రాన్స్‌జెండర్లు చికిత్స పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆర్థికంగా వెనుకబడిన వారికి పెద్ద ఊరట లభించనుంది.ట్రాన్స్‌జెండర్లకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడం, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇప్పటికే విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో పలు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు ఆరోగ్య రంగంలోనూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం విశేషంగా మారింది.ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, సమగ్ర సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *