బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ?.. అభ్యర్థుల్లో ఆశలు

త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ?.. అభ్యర్థుల్లో ఆశలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19 వేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తొలి దశలో సుమారు 5 వేల కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపినట్లు తెలుస్తోంది.ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించిన వెంటనే నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాల నియంత్రణ, ప్రత్యేక భద్రతా విభాగాల బలోపేతం కోసం ఈ నియామకాలను చేపట్టనున్నట్లు సమాచారం.ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ వంటి విభాగాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.అయితే ఇప్పటివరకు ఈ నియామకాలపై ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఉద్యోగార్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. నియామక ప్రకటన విడుదలైతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి