బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సర్కారు బడుల్లో చదవడం గర్వకారణం: మంత్రి పొన్నం ప్రభాకర్

సర్కారు బడుల్లో చదవడం గర్వకారణం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం తక్కువ కాదని, విద్యార్థుల్లో ఉన్న అపోహలను ఉపాధ్యాయులు తొలగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించిన గిరిజన గురుకుల సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, సర్కారు బడుల నుంచి కూడా అత్యున్నత ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులు నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని చెప్పారు.పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చెబుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గ్రామస్థాయిలో సన్మానించాలని ఆయన సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా ప్రోత్సహించే వాతావరణం కల్పించాలని, సర్పంచులు ముందుకు వచ్చి ప్రతిభావంతులను గౌరవించాలని కోరారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తమ లక్ష్యాలను సాధించాలని, గురుకులాలు మరియు ప్రభుత్వ విద్యాసంస్థలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి