బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పవన్ సభపై కవిత హెచ్చరిక.. రాజకీయ వాతావరణం వేడెక్కింది

పవన్ సభపై కవిత హెచ్చరిక.. రాజకీయ వాతావరణం వేడెక్కింది

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న సభపై రాజకీయ వివాదం నెలకొంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించిన కవిత, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు లేదా చర్యలను తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని పేర్కొన్నారు.

అలాగే, “మాది టీఆర్ఎస్ 2.0. గతంలో మాతో పెట్టుకుంటే రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే గట్టిగా బదులిస్తాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, తెలంగాణ నవనిర్మాణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మరోవైపు, జనసేన నిర్వహించనున్న సభపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ ఈ రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.