బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఎయిర్ ట్రంక్ డేటా సెంటర్ క్యాంపస్‌కు లోకేష్ ఆహ్వానం

విశాఖలో ఎయిర్ ట్రంక్ డేటా సెంటర్ క్యాంపస్‌కు లోకేష్ ఆహ్వానం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎయిర్ ట్రంక్ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాను ఆయన ఆహ్వానించారు.

ముంబయిలో జరిగిన సమావేశంలో విశాఖపట్నం డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన నగరమని లోకేష్ వివరించారు. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ వంటి కీలక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన కనెక్టివిటీ, విద్యుత్ వనరులు, పారిశ్రామిక మద్దతు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

డేటా సెంటర్ల అవసరాలకు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని లోకేష్ తెలిపారు. భారత్‌లో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నాన్ని ప్రాధాన్యంగా పరిశీలించాలని ఎయిర్ ట్రంక్ సంస్థను కోరారు.

గతంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రారంభమైన చర్చల అనంతరం ఎయిర్ ట్రంక్ ప్రతినిధులు పలుమార్లు ఏపీ అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబయి, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, భవిష్యత్ విస్తరణలో విశాఖను కూడా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.