Breaking News

CM Revanth Reddy fire on KCR

కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ – పాలమూరు ప్రాజెక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

నారాయణపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేసివుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌తో నీటి వివాదం వచ్చుండదని అన్నారు.

“ప్రజలు పదేళ్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన పాలమూరు ప్రజలను మోసం చేశారు. మేము అధికారంలోకి రాగానే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాము. పాలమూరు హరితభవనంగా మారుతుంటే, కేసీఆర్ ఓర్వలేక కోపంగా ఉన్నాడు” అని ఆరోపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దానిని పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ డిజైన్‌ను మార్చి, కేసీఆర్ ఏడాది పాటు ప్రజలను మోసగించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు

కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం, “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ముందు నీ కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత అవినీతి గురించి సమాధానం చెప్పాలి. కాళేశ్వరం స్కాం, లిక్కర్ స్కాం ద్వారా రాష్ట్ర పరువు తీసిన నీ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకో” అని కేసీఆర్‌కు సూచించారు.

ఏడాదిలో కాంగ్రెస్ చేసిన కీలక కార్యక్రమాలు

అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేశామని సీఎం తెలిపారు. తాను ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ స్కామ్: 600 సిమ్ కార్డులు, కోట్ల రూపాయల మోసం

ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. పాలమూరు ప్రజలకు తాము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *