ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు – || Ex-minister’s sensational comments ||
విజయవాడ: తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ సబ్ జైలు వద్దకు వెళ్లిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల మౌన అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లో ఈ అక్రమ చర్యలు జరుగుతున్నాయని పేర్ని నాని ఆరోపించారు. అయితే, తాను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
పీడీఎస్ రైస్ కేసులో పేర్ని నాని నిందితుడా?
పీడీఎస్ రైస్ మాయం కేసులో పేర్ని నాని నిందితుడిగా ఉన్నారని, ఆయనపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఈ కేసులో పోలీసులు త్వరలోనే అరెస్టు చేయబోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే వెల్లడించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులోనూ చిక్కులు
గుంటూరు మిర్చి యార్డు వద్ద వైసీపీ అధినేత జగన్‌తో కలిసి రైతులను పరామర్శించేందుకు వెళ్లినందుకు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పేర్ని నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.