బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సింగరేణిలో కవితకు సహకరించిన అధికారి పై చర్యలు అవసరం

సింగరేణిలో కవితకు సహకరించిన అధికారి పై చర్యలు అవసరం

Madhuyashki GoudAction is required on the official who contributed to the poem in Singareni

సంధి ముగిసింది.. అధికారులపై చర్యలు తధ్యం: మధుయాష్కీ

హైదరాబాద్: ప్రభుత్వంలోని కీలక అధికారులు ప్రతిపక్షాలతో కుమ్మక్కై ప్రభుత్వం సమాచారాన్ని లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

సోమేష్ కుమార్ బాగోతం ఇంకా బయటపడాలి

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ, “సోమేష్ కుమార్ అండతోనే జీఎస్టీ కుంభకోణం జరిగింది. దోచుకున్న అధికారులపై విచారణ జరిపించాలి. అభయ్ కుమార్ లాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. విచారణలో మందకొడిగా వ్యవహరించడంతో రాజీ కుదిరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

సింగరేణిలో కవితకు సహకరించిన అధికారి పై చర్యలు అవసరం

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సింగరేణిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సహకరించిన ఓ అధికారి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారని మధుయాష్కీ ఆరోపించారు. “సంధి కాలం ముగిసింది.. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలి” అని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలతో కుమ్మక్కయిన అధికారులపై కఠిన చర్యలు

ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేస్తున్న అధికారులను ఉపేక్షించేది లేదని మధుయాష్కీ హెచ్చరించారు. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.