|| VH met AP CM Chandrababu || – దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని విజ్ఞప్తి
విజయవాడ: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వి.హెచ్) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు.
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత సీఎం దామోదరం సంజీవయ్య పేరిట ఏపీలోని ఒక జిల్లాకు నామకరణం చేయాలని, అలాగే స్మృతివనం నిర్మించాలని వీహెచ్ కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, సంజీవయ్య నిజాయతీగల నేతగా గుర్తింపుపొందారని వీహెచ్ పేర్కొన్నారు.
చంద్రబాబుతో తాజా రాజకీయాలపై చర్చ
ఈ భేటీలో వీహెచ్, చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబుతో దగ్గుబాటి భేటీ – పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానం
ఇక, మూడున్నర దశాబ్దాల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.
- దగ్గుబాటి రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు.
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి वेंకయ్య నాయుడు లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.