Breaking News

“We condemn the arrests.

అరెస్టులను మేము ఖండిస్తున్నాం.

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.

“అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఆదానీని దొంగ, అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ తిడితే, ఇక్కడ రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేస్తుంటాడు. అలాయ్ బలాయ్ చేస్తుంటాడు. ఆదానీతో వేలకోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటాడు. ఇది న్యాయం కాదు.

ప్రతిపక్షాలు వివిధ మార్గాల్లో నిరసనలు తెలియజేస్తుంటాయి. అయితే, వాటిని అడ్డుకోవడం దుర్మార్గం. అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయటపడతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

సభను ఏకపక్షంగా నిర్వహించాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఆదానీతో చీకటి ఒప్పందం బయటపడిందని మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నారు.

రేవంత్ రెడ్డి, మీరెందుకు ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు? పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదానీ, మోడీ బాయ్ బాయ్ అని స్లోగన్స్ వేసుకుని టీషర్ట్స్ వేసుకున్నారు. మేము ఇక్కడ మీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తే అది తప్పేంటి?

మీరు తప్పు చేసినందుకు మీకు భయం.”

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *