Breaking News

History does not condone if Telangana's mother politicizes the statue

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసే వారిని చరిత్ర క్షమించదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం ప్రత్యేకతల గురించి వివరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతల అభ్యర్థన మేరకు విగ్రహాన్ని రూపొందించలేదు అని చెప్పారు.

విగ్రహం మేధావులు, కవులు, కళాకారుల సూచనల ఆధారంగా రూపొందించబడిందని, ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తే మంచిది కాబోతుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరూ రావాలని కూనంనేని సూచించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

“మీరు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకోవచ్చు కానీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రూపకల్పన చేస్తే తప్పేంటి?” అని కూనంనేని ప్రశ్నించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది, ఈ విగ్రహం కన్నతల్లిలా ఉండాలని చెప్పారు.

కాసేపట్లో తెలంగాణ సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *