Breaking News

మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్ ఫైర్.. BRSపై ఘాటు విమర్శలు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్కు నోటీసులు తామే జారీ చేశామని, అదే అంశాన్ని బీఆర్ఎస్ సభలో హడావుడిగా ప్రస్తావిస్తోందని విమర్శించారు. మైనింగ్‌లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే విచారణకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న మైనింగ్ దోపిడీపై సీబీసీఐడీ ద్వారా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అక్రమాలను తమ ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకుంటోందని, గత ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని ఆరోపించారు.ఎవరికి ఏవైనా అనుమానాలు ఉన్నా సీబీసీఐడీకి ఫిర్యాదు చేయాలని సూచిస్తూ, మైనింగ్ శాఖలో అవినీతిని పూర్తిగా బయటపెట్టాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అదే సమయంలో, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు మధ్య అంతర్గత విభేదాలను ప్రస్తావిస్తూ, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *