Breaking News

తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ.. రెండు చోట్ల పోటీతో హాట్ టాపిక్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికేలా సినీ నటుడు విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తన పార్టీ TVK తరఫున ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. చెన్నైలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఇప్పటివరకు ద్రవిడ రాజకీయాల్లో ప్రధానంగా రెండు పార్టీల ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఇప్పుడు విజయ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారతాయా అన్న చర్చ జోరందుకుంది. కొత్త నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, తన పార్టీ కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇస్తోందని తెలిపారు. సినిమా నేపథ్యం కారణంగా తమను తక్కువగా అంచనా వేస్తున్న వారికీ ప్రజల తీర్పుతో సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

అదేవిధంగా, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఆర్థిక సాయం, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు వంటి హామీలను ప్రకటించారు. తమిళనాడును మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చుతామని కూడా పేర్కొన్నారు.విజయ్ ప్రచారంలో “ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అనే నినాదాన్ని వినిపించడం గమనార్హం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపయోగించిన స్లోగన్‌ను గుర్తు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మొత్తంగా, రెండు చోట్ల పోటీతో విజయ్ రాజకీయ అరంగేట్రం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ఆయన ఎంత మేర ప్రభావం చూపుతారో చూడాల్సి ఉంది.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *