Breaking News

తెలంగాణలో ‘తొలి ముద్ద’ పథకం ప్రారంభం.. పిల్లలకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ప్రతిరోజూ ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.ఈ పథకం కింద పిల్లలకు ఉదయం ఉప్మా, కిచిడీ వంటి పౌష్టికాహారం అందించనున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్యంగా ఎదగడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సీఎం సూచించారు.అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అన్ని కేంద్రాలను సొంత భవనాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్లు అందిస్తూ వారి పనిని సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.పిల్లలను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలని, వారి ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ‘తొలి ముద్ద’ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది చిన్నారులకు నేరుగా లాభం చేకూరనుంది.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *