Breaking News

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 29 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం రోజు భువనగిరి పట్టణంలో గల వివేరా హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకొని జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని,విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షలతో ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, అక్రిడేషన్లు కార్డులు త్వరగా ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపారు. బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేకపోవడం, దారుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న, గౌరవ అధ్యక్షులు మత్యాస్, కార్యదర్శి శ్రీను, సత్యం, వలి పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *