Breaking News

పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

పెన్ పహాడ్ మండల కేంద్రం లో ధనియాకుల గురువయ్య స్మారక భవన నిర్మాణ శంకుస్థాపన.

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

సూర్యాపేట/పెన్ పహాడ్ : మార్చ్29 (నేటి తెలుగు పత్రిక): పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం అమరజీవి కామ్రేడ్ ధనియాకుల గురువయ్య స్మారకార్థం మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం వారు మాట్లాడారు. కామ్రేడ్ దన్యాకుల గురువయ్య సాధారణ కార్యకర్త స్థాయి నుండి ఉమ్మడి సూర్యాపేట తుంగతుర్తి పార్టీ కార్యదర్శిగా , సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం త్యాగం చేసిన యోధుడన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో తనదైన శైలితో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడన్నారు . పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు పoచాడన్నారు. భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాల ఉద్యమాలు నిర్వహించాడు అన్నారు. పెన్ పహాడ్ మండలంలో సిపిఎం ప్రజాప్రతినిధుల ను గెలుచుకోవడంలో క్రియాశీల పాత్ర పోషించాడు అన్నారు.గురవయ్య నాయకత్వంలో పార్టీ ఎదుగుదలను ఓర్వలేని నాటి కాంగ్రెస్ నరహంతక ముఠా ప్రజా సమస్యపై సూర్యాపేట లో విద్యుత్ అధికారి ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో దారి కాచి అత్యంత కిరాతకంగా 1999 ఫిబ్రవరి 11న హతమార్చారన్నారు. గురువయ్య ను హతమార్చినంత మాత్రాన ప్రజా పోరాటాలు ఆగలేదు అన్నారు. ఆయన త్యాగస్ఫూర్తితో ఇప్పటికీ సిపిఎం ప్రజా సమస్యలపై అనేక పోరాట ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. తన పేరు మీద మండల కేంద్రంలో నిర్మించే భవనాన్ని పోరాట కేంద్రoగా మార్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నాయని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. బిజెపి దేశంలో మతోన్మాద రాజకీయాలకు పూనుకొని ప్రజల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాల పాలన ప్రజా సమస్యలను పరిష్కరించ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర లేదన్నారు. రైతులకు యూరియా కరెంటు కష్టాలు తీవ్రమయాయని రైతు భరోసా సకాలంలో అందలేదన్నారు. ఇంకా నిరుపేదలకు ఇల్లు లేవని ఇండ్లను నిర్మించాలన్నారు. ఎన్నికల ముందు పెన్షన్ పెంచుతామని , మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ గాలికి వదిలేసారన్నారు. విద్యా వైద్య రంగాలు బ్రష్టు పట్టిపోయాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వీరబోయిన రవి, మండల కమిటీ సభ్యులు గుర్రం గోపాల్ రెడ్డి, నెమ్మాది అడివయ్యా, మడ్డి అంజిబాబు, నెమ్మాది లక్ష్మమ్మ, పీరయ్య,ఇరుగు రమేష్, బోగరాజ్ శ్రీకాంత్ , చిన పంగి నరసయ్య జానయ్య చారి , నకిరే కంటి నరసయ్య సత్యం వీరస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *