Breaking News

హైదరాబాద్‌ ప్రజలకు కీలక గడువు.. ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీకి ఇదే చివరి ఛాన్స్!

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం కింద వడ్డీపై 90 శాతం మాఫీ పొందే అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.ఈ గడువులోపు బకాయిలు చెల్లించిన వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గృహ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలపై ఈ పథకం అమల్లో ఉందని తెలిపారు. పన్ను చెల్లింపులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తామని వెల్లడించారు.నగర ప్రజలు GHMC అధికారిక వెబ్‌సైట్, MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా తక్షణమే చెల్లింపులు చేయాలని కోరారు. గడువు దాటితే మాఫీ ఉండదని, మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా నగరాభివృద్ధికి సహకరించాలని GHMC ప్రజలకు పిలుపునిచ్చింది.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *