Breaking News

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలకు గౌరవం.. ప్రజాసేవే లక్ష్యం: సీఎం నారా చంద్రబాబు నాయుడు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి సత్కరించడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ విభాగాల్లో మెరుగైన సేవలు అందించిన వారికి వేదికపై ప్రత్యేక స్థానం కల్పించడం ద్వారా వారి సేవలను ప్రశంసించారు.కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొన్న సీఎం చంద్రబాబు, వారి అంకితభావంతోనే టీడీపీ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధే పార్టీ ప్రధాన లక్ష్యమని, అదే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *