Breaking News

మంచి రోడ్లు ఆర్థికాభివృద్ధికి బాటలు – అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి

రోడ్ల అభివృద్ధితో పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయని వెల్లడి

ప్రమాదాల నివారణకు ‘Arrive Alive’ కార్యక్రమం

HAM విధానంలో వేల కిలోమీటర్ల రోడ్ల పనులు

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

RRR, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు గేమ్ ఛేంజర్

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో జరిగిన శాసనసభ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల అభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. మంచి రోడ్లు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.రోడ్ల నిర్మాణంతో పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి రైతులకు మార్కెట్లకు చేరుకోవడంలో సౌలభ్యం కల్పిస్తుందని, విద్యార్థులు, రోగులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుతాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, తెలంగాణలో కూడా ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండటం విచారకరమని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘Arrive Alive’ కార్యక్రమాన్ని అమలు చేస్తూ సురక్షిత రోడ్లపై దృష్టి సారించినట్లు తెలిపారురాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం Hybrid Annuity Model (HAM) విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా సుమారు 12,000 కి.మీ రోడ్ల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మెరుగైన నాణ్యత, దీర్ఘకాలిక నిర్వహణతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

ప్రధాన రహదారి ప్రాజెక్టులుగా Regional Ring Road (RRR), హైదరాబాద్–విజయవాడ విస్తరణ, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎలివేటెడ్ కారిడార్లు చేపడుతున్నామని తెలిపారు. ఇవి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయని అన్నారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.“మంచి రోడ్లు అంటే ఆర్థికాభివృద్ధి, సురక్షిత జీవితం, ప్రజల భవిష్యత్తు” అని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *