సూర్యాపేట, మార్చి 30(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి అని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో మద్యపాన నిషేధం పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీయడం జరిగింది. సంపూర్ణ మధ్యపాన నిషేధ గ్రామం గా చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. ఈరోజు గ్రామ సర్పంచ్ పొనుగోటి నరేందర్ ఆధ్వర్యంలోసూర్యాపేట జిల్లా కలెక్టర్ కలిసి సంపూర్ణ మద్యపానం నిషేధం గురించి తెలియజేయడం జరిగింది. కలెక్టర్ స్పందించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తీర్మానానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా మీ గ్రామానికి నేను వస్తాను* అని మాట ఇవ్వడం జరిగింది . ఆ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అయ్యేలాగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశం జారీ చేయడం జరిగింది . సర్పంచి , గ్రామ అభివృద్ధి గురించి సహకరించాలి అనికలెక్టర్ ని కోరడం జరిగింది తప్పకుండా మీ గ్రామంలో అభివృద్ధి కొరకు సహకరిస్తామని మాటివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్ సూరపల్లి సైదులు గ్రామ యువజన నాయకుడు సతీష్ వంశీ పాల్గొన్నారు.
