Breaking News

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు.నాయుడుపేటలో జరిగిన భారీ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 2.50 లక్షలకుపైగా ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీల తరహాలో ఈ గృహాలను నిర్మించామని తెలిపారు.గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ కాలంలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే లక్షలాది ఇళ్లు అందించగా, త్వరలో మరిన్ని ఇళ్లు పూర్తి చేసి పంపిణీ చేస్తామని చెప్పారు.పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రతి ఇంటిపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే విద్యుత్ ఆదా చేసే పరికరాలను కూడా అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

‘దీపం 2.0’ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కొనసాగుతోందని, భవిష్యత్తులో పైపుల ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు హామీ ఇచ్చారు. మహిళలు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అమరావతిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *