Breaking News

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: లోక్ భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, వేల కోట్ల ప్రజా సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *