Breaking News

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు కలకలం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు ఘటన కలకలం రేపింది. సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక ఎస్‌ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ప్రభావంతో పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసమైంది. గాయపడిన సిబ్బందిని వెంటనే చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేలుడుకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *