రేణిగుంటలో గంజాయి పట్టివేత
తిరుపతి జిల్లా రేణిగుంటలో గంజాయి సరఫరాను పోలీసులు అడ్డుకున్నారు. రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు కరకంబాడికి చెందిన వలవ సక్కుబాయి, తిరుపతికి చెందిన గుండ్లకట్ట చిరంజీవిగా గుర్తించారు.
విశాఖపట్నంకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
ఇరువురిని రిమాండ్‌కు తరలించినట్లు రేణిగుంట సీఐ శరత్ చంద్ర, ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి బృందం తెలిపారు.