పాలకొల్లు పట్టణంలోని బిఆర్ఎంవి మున్సిపల్ హైస్కూల్లో ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో (నెంబర్.113)గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగంకు ఉపాధ్యాయులు నెమ్మదిగా వస్తున్నారు. ఎఎస్ఐ మద్దాల శివాజీ సారధ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదు. మొత్తం ఇక్కడ 480 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. గత రాత్రి ఎటువంటి ప్రలోభాలు జరిగినట్లు సమాచారం లేదు.
