Breaking News

ఏపీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టులు.. భారీ నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్

మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో భారీ స్థాయిలో అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,523 పోస్టుల భర్తీకి అధికారిక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ప్రభుత్వం ఆమోదించిన పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో భాగంగా చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల మెరిట్, అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.ఇక అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారం అనుభవం, అకాడమిక్ రికార్డులు, అర్హతల ఆధారంగా ప్రత్యక్ష నియామకాలు చేపట్టనున్నారు.ఆన్‌లైన్ దరఖాస్తులు, డిజిటల్ స్క్రూటినీ, పారదర్శక ఎంపిక విధానాలతో నియామక ప్రక్రియ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నియామకాల ద్వారా విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పరిశోధన, బోధన రంగాలకు కొత్త ఊపిరి లభిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాయలసీమను గ్రోత్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

వైసీపీ ఆందోళనలపై బైరెడ్డి శబరి విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *