బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శివక్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్ సందడి

శివక్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్ సందడి

మే 22, (నేటి తెలుగు పత్రిక): తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ షూటింగ్ మూడో షెడ్యూల్‌గా నిర్వహించబడింది. చిత్రంలో సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర పాత్రలో ప్రత్యేకంగా నటించి ఆకట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. శివశైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీశివ స్వామి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు.ఆలయ పరిసరాల్లో చిత్రీకరణకు దేవాలయ అధికారుల నుంచి పూర్తి సహకారం అందిందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సంతోష్ రావు బల్గూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సుధాకరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.కథను జగపతి శ్రీనివాస్ అందించగా, సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను దాసరి రవికుమార్ నిర్వహిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా, ఎస్.ఏ.టి. శ్రీధర్ పీఆర్వోగా పని చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌లో నాల్గో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్