బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: గొట్టిపాటి రవి కుమార్

అమరావతిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: గొట్టిపాటి రవి కుమార్

మే 25, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు, భారీ హోర్డింగ్‌లు విద్యుత్ స్తంభాలపై పడటంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అత్యవసరంగా మరమ్మతు చేసి, వీలైనంత త్వరగా సరఫరా పునరుద్ధరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.పునరుద్ధరణ పనుల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లొద్దని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్