బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో చెల్లిస్తాం: కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో చెల్లిస్తాం: కేటీఆర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముషీరాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, మరో ఏడాది పాటు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే రాజకీయంగా లెక్కలు సరిచేసే అవకాశం వస్తుందని అన్నారు.కాంగ్రెస్‌ను చూసుకుని బీజేపీ, బీజేపీని చూసుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్, ప్రజలు సరైన సమయంలో ఇరు పార్టీలకు సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హైదరాబాద్ నగరానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ, ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటోందని, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవేనని పేర్కొంటున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి