బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస వసతి కల్పించేందుకు ప్రత్యేక గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే నిర్మాణ రంగానికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగర మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.ఇక హైకోర్టు భవనాల పరిసర ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.547 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు సమావేశం అంగీకారం తెలిపింది.రాజధాని అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు నివాస, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్