బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు ప్రత్యేక రైతు డిస్కమ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారంటూ అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డ సీఎం, ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. “రైతుల మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత కరెంట్‌ను నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయం. కానీ మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా బీఆర్ఎస్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటుందా?” అంటూ ప్రశ్నించారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి