బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి: విద్యాశాఖ కార్యదర్శి

డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి: విద్యాశాఖ కార్యదర్శి

మే 31, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.పరీక్షల నిర్వహణ కోసం 42 వేల ప్రశ్నలతో ప్రత్యేక ప్రశ్నల బ్యాంకును రూపొందించామని, దీనికి ఎవరికీ ప్రత్యక్ష ప్రాప్యత ఉండదని వెల్లడించారు. అత్యాధునిక కంప్యూటర్ విధానంలో ప్రతి అభ్యర్థికి వేర్వేరు ప్రశ్నలు వెళ్లేలా పరీక్షలను నిర్వహించామని చెప్పారు.నియామక ప్రక్రియను కేవలం 148 రోజుల్లో పూర్తి చేసి, 15,941 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు వివరించారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని, వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.ఉపాధ్యాయ నియామకాల విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించిందని, అర్హులైన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని కోన శశిధర్ పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్