Breaking News

Ex-minister's nomination in AP High Court

మాజీ మంత్రి పేర్నినానికి హైకోర్టులో ఊరట

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినానికి ఏపీ హైకోర్టులో ఊరట

ఏపీ హైకోర్టులో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి స్వల్ప ఊరట లభించింది. ఈ రోజు మంగళవారం హైకోర్టులో పేర్నినాని వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సోమవారం (జనవరి 6) వరకు ఎటువంటి వేగవంతమైన చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారంకి వాయిదా వేసినట్టు న్యాయస్థానం ప్రకటించింది.

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని 6వ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిపై కేసు నమోదైన విషయం కూడా పాఠకులకు తెలియజేస్తున్నాము. కృష్ణా జిల్లా బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు ఫైల్ అయ్యింది.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

ఈ కేసులో పేర్నినాని పరారీలో ఉన్నట్లు సమాచారం వచ్చింది, అయితే అనూహ్యంగా పేర్నినాని హైకోర్టును ఆశ్రయించి, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *