Breaking News

A narrow miss for the convoy of Union Ministers

కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది

కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వీరు విశాఖ నగర పర్యటనలో భాగంగా ప్రయాణిస్తుండగా, గురువారం ఉదయం షీలా నగర్ వద్ద వీరి కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లు దెబ్బతిన్నాయి, అందులో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చెందిన వాహనం కూడా ఉంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన

కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పర్యటించనున్నారు.
🔹 నిర్వహణపై అధికారులతో సమీక్ష
🔹 కార్మిక సంఘాలతో సమావేశం

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.

కార్మిక సంఘాల నిరసన

🚩 కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా కార్మికులు నిరసన తెలపాలని నిర్ణయించారు.
🔹 జీతాలు చెల్లించాలి
🔹 విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్లో విలీనం చేయాలి

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

ఈ డిమాండ్లను కార్మిక సంఘాలు బ్యాడ్జీలతో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *